
ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనేక సౌకర్యాలు మెరుగు పరిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు వెచ్చించి ప్రభుత్వ బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి దిద్దారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారి పోయాయి. మాకు పాఠాలు చెప్పడంలోనూ, విద్యార్థులు చదువుకోవడంలోనూ శ్రద్ధ పెరిగింది. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందుతోంది.
– బడుగు ఓబులేసు,ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎంపీపీ స్కూల్, ఎస్టీ కాలనీ, కమలాపురం
పింఛన్ మంజూరైంది
గతంలో టీడీపీ ప్రభుత్వంలో మా గ్రామంలో రెండు మూడు సార్లు జన్మభూమిలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. కానీ జన్మభూమి కమిటీ వారు మంజూరు చేయలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే నాకు పింఛన్ మంజూరైంది. అర్హత ఉంటే చాలు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మంజూరు చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– ఆర్. లక్ష్మినారాయణరెడ్డి, బి.కొట్టాలపల్లె, కొండాపురం మండలం.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా పేదల బతుకులు బాగుపడ్డాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
–సాక్షి నెట్‌వర్క్

