నేడు ఎన్‌డీసీఎంఎస్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు ఎన్‌డీసీఎంఎస్‌ సమావేశం

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

నల్లగొండ టౌన్‌ : నల్లగొండ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం ఉదయం 11గంటలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు బిజినెస్‌ మేనేజర్‌ నాగిళ్ల మురళి మంగళవారం తెలిపారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షులు, బి క్లాస్‌ సభ్యులు హాజరై డీసీఎంఎస్‌ మార్క్‌ఫెడ్‌లో విలీనంపై సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

హరిహరులకు సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. కార్తీక పౌర్ణమి కలిసి రావడంతో మంగళవారం హరిహరులకు విశేషంగా పూజలు జరిపించారు. వేకువజామున 3గంటలకే సుప్రభాతం నిర్వహించారు. అనంతరం శ్రీనృసింహస్వామికి అభిషేకం, ఆరాధన, సహస్రనామార్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ, సాయంత్రం జోడు సేవలను నిర్వహించారు. ఇక శివాలయంలో బిల్వ పత్రంతో అభిషేకం చేశారు.

చేనేత బీమా పథకాన్ని పునరుద్ధరించాలి

మోత్కూరు : చేనేత బీమా పథకాన్ని పునరుద్ధరించాలని చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ బీమా పథకం రేషన్‌ కార్డు ఉన్న కుటుంబ యజమానికి మాత్రమే వర్తించేలా ఉండడంతో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో జియో ట్యాగ్‌ కలిగి త్రిప్ట్‌ పథకంలో నమోదైన 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల చేనేత కార్మికులు అకాల మరణం చెందితే రూ.5 లక్షల బీమా పరిహారం అందేదని, 59 ఏళ్లు పైబడిన వారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చే వారని గుర్తు చేశారు. ఈ పథకం చేనేత కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు కూడా వర్తించేదని తెలిపారు. ఈ సమావేశంలో చేనేత నాయకులు పున్న వెంకటేశం, ఏలే సనత్‌కుమార్‌ ఉన్నారు.

ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరం ప్రారంభం

నల్లగొండ టూటౌన్‌ : పట్టణంలోని చర్లపల్లి విపస్య స్కూల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్‌ శిక్షణ శిబిరాన్ని మంగళవారం బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీల కోసం బాలికలకు 18 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బండారు ప్రసాద్‌ మాట్లాడుతూ.. శిబిరంలో పాల్గొనే క్రీడాకారిణులకు ఉచిత భోజన, వసతి కల్పించినట్లు వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బొజ్జ శంకర్‌, దాసరి సాయి, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్‌ యాదవ్‌, రాఖీ, అశోక్‌ ముదిరాజ్‌, కోచ్‌ సంజయ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement