నేటి నుంచి బాండ్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బాండ్ల పరిశీలన

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్ల పరిశీలనకు అధికారులు సిద్ధం చేశారు.

- 8లో

ఆకాశ దీపోత్సవం

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో, అనుబంధ శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఆకాశ దీపోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలోని ధ్వజ స్తంభం వద్ద, శివాలయంలోని ధ్వజ స్తంభం వద్ద ఆకాశ దీపానికి పూజలు చేశారు. ప్రత్యేక తాడు సాయంతో ధ్వజ స్తంభంపైకి దీపాన్ని పంపించి వేడుక నిర్వహించారు. వేడుకల్లో వైటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు మల్లయ్య, విజయరాజం, ఈఓ భవానీ శంకర్‌, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి పాల్గొన్నారు. ఇక మధ్యాహ్నం వేళ ఆలయంలో అన్నకూటోత్సవాన్ని జరిపించారు. మధ్యాహ్నం 12 నుంచి 2గంటల వరకు అన్నకూటోత్సవం సందర్భంగా సుమారు రెండు గంటల పాటు అన్ని రకాల దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. అన్నకూటోత్సవం పూర్తయిన తరువాత భక్తుల దర్శనాలను పునః ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement