యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరి క్షేత్రంలో నిత్యపూజలు

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి. బుధవారం వేకువజామునే స్వామివారిని మేల్కొలిపిన ఆలయ అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. ఆ తర్వాత నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన ఆరాధన, బాలభోగం, సహాస్త్రనామార్చన పూజలు చేపట్టారు. ప్రధానాలయం ముఖమండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన అష్టోత్తర సేవలు చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో నిత్య కల్యాణం, నారసింహ హోమం, గజవాహన సేవ, బ్రహోత్సవం వంటి నిత్య కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం తిరుమాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement