భువనగిరి: మాదక ద్రవ్యాలకు బానిసలైతే జీవితం ఆగమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అపరిచితులు ఆహార పదార్థాలు ఇస్తే తీసుకోవద్దన్నారు. అనంతరం విద్యార్థుల చేత మాదక ద్రవ్యాల నిషేధం పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఫోక్సో చట్టం పై అవగాహన క ల్పించారు. అనంతరం స్థానిక బాలుర ఎస్టీ వసతి గృహంలోనూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తుక్కానాయక్, ఎకై ్సజ్ సీఐ వేణుకుమార్, హాస్టల్ వెల్ఫేర్ ఆపీసర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


