గురుకులాల్లో భద్రత గాలికి | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో భద్రత గాలికి

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

మహిళా సిబ్బంది ఉండాలన్న

నిబంధన అమలేదీ?

రాత్రి బస శూన్యం

నిఘా ఏదీ?

సాక్షి,యాదాద్రి: సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, జనరల్‌ గురుకుల విద్యా సంస్థల్లో బాలికల భద్రత గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సంస్థ పరువు పోతుందన్న భయంతో ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పిల్లల ఫిర్యాదులను తొక్కిపెడుతుండటంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయి.

కలవరపెడుతున్న ఘటనలు

● అడ్డగూడూరు గురుకులంలో 55 ఏళ్ల కాంట్రాక్ట్‌ వంటమనిషి విద్యార్థినులకు డబ్బు ఆశచూపి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పినా ఉదాసీనంగా వ్యవహరించారు. తల్లిదండ్రుల ఆందోళనతో విషయం వెలుగులోకి రాగా.. నిందితుడు.. తన మొదటి భార్యను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించి, క్షమాభిక్షపై విడుదలైన నేరస్తుడు. కనీసం పోలీస్‌ వెరిఫికేషన్‌ లేకుండానే విధుల్లోకి చేరినట్లు తేలింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌, మెస్‌ సిబ్బంది, కాంట్రాక్టర్లపై పోక్సో కేసులు నమోదయ్యాయి.

● 2024 అక్టోబర్‌లో భువనగిరి బాలసదనంలో బాలికలకు గుడ్‌ టచ్‌ – బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కల్పిస్తున్న సమయంలోనే.. అటెండర్‌ ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడటం భద్రతా వైఫల్యాలకు అద్దంపడుతోంది.

బాలల రక్షణ కమిటీల జాడ లేదు

విద్యార్థులు నిర్భయంగా ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన బాలల రక్షణ కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కంప్లైంట్‌ బాక్సులు, హెల్ప్‌లైన్‌ నంబర్ల 1098 (చైల్డ్‌లైన్‌), 112/100 (పోలీస్‌), 181 (మహిళా హెల్ప్‌లైన్‌), గురుకుల సొసైటీ టోల్‌–ఫ్రీ, కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ప్రతి అంతస్తు, డైనింగ్‌ హాల్‌లో కనిపించేలా ప్రదర్శించాలి. కానీ అలాంటి ఏర్పాట్లు ఏమీలేవు.

సమగ్ర విచారణ జరపాలి : ఎమ్మెల్యే సామేల్‌

అడ్డగూడూర్‌: విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్యే మందుల సామేల్‌ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌ ఝాన్సీ రాణి, నిందితుడు శ్రీరాముల వెంకన్న లతోపాటు మెస్‌అటెండర్‌ పూలమ్మ, కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీకి ఆదేశించినట్లు చెప్పారు.

బాలికల గురుకులాల్లో 100శాతం మంది మహిళా సిబ్బందే ఉండాలన్న నిబంధన అమలు కావడం లేదు. సరుకుల సరఫరా, అత్యవసర మరమ్మతుల పేరిట పురుషులు క్యాంపస్‌, వంటగది, డైనింగ్‌ హాళ్లలోకి వస్తున్నారు. వారి ఫోన్ల ద్వారా విద్యార్థినులు ఇళ్లకు మాట్లాడుతూ.. బయటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు.

ఫ కాగితాలకే పరిమితమైన నిబంధనలు

ఫ అడ్డగూడూరు, భువనగిరి ఘటనలతో బట్టబయలైన పర్యవేక్షణా లోపం

ఫ హత్య కేసులో శిక్ష పడిన వ్యక్తికి వంటమనిషిగా ఉద్యోగం

ఫ విద్యార్థినులపై లైంగిక వేధింపులు

ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు రొటేషన్‌ పద్ధతిలో క్యాంపస్‌లోనే రాత్రి బస చేయాలి. కానీ 90 శాతం చోట్ల రాత్రి 9 గంటలు దాటితే బాధ్యతలు వదిలేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రాత్రివేళ విద్యార్థినులకు అనా రోగ్యం చేస్తే మహిళా వార్డెన్‌ తోడుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండగా.. ఆటోలను ఆశ్రయిస్తున్నారు.

సీసీటీవీ కెమెరాలు నామమాత్రంగానే ఉన్నాయి. మెయిన్‌ గేట్‌, కారిడార్లు, డైనింగ్‌ హాల్స్‌ వద్ద ఉండాల్సిన నిఘా, 30 రోజుల ఫుటేజీ రికార్డింగ్‌, కంట్రోల్‌ రూమ్‌ అనుసంధానం ఎక్కడా కనిపించడం లేదు. సందర్శకుల రిజిస్టర్‌ నిర్వహణ కూడా అస్తవ్యస్తంగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement