భువనగిరిటౌన్ : జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జిగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు పరిపాలనా జడ్జీలను పునర్విభజిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నవంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న ఉత్తర్వులను రద్దు చేస్తూ జారీ చేసిన ఈ నూతన కేటాయింపులు నవంబర్ 17వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి భువనగిరి జిల్లా న్యాయపరమైన, పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. కాగా నల్లగొండ జిల్లాకు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, సూర్యాపేట జిల్లాకు జస్టిస్ కె. శరత్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
భువనగిరిటౌన్ : బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని ప్రతి చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్ (సీసీఐ)లో పిల్లలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చిలు కూరి శ్రీనివాస్, సీడబ్ల్యూసీ సభ్యులు రు ద్రమ, శివరాజు, ఇస్తారి, లేబర్ ఆఫీసర్ రాజు, డీఎల్‌ఎస్‌ఏ ప్రతినిధి సాయి శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీ సర్ వీణ, డీఎంహెచ్‌ఓ ప్రతినిధి, సీడీపీఓలు స్వరాజ్యం, శైలజ, అనంతలక్ష్మి పాల్గొన్నారు.
నేటి నుంచి శ్రీ మత్స్యగిరి బ్రహ్మోత్సవాలు
వలిగొండ : వలిగొండ మండలం వెంకటాపురంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ఈ నెల 24 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటయ్య బుధవారం వెల్లడించారు. 22 న శ్రీ స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
భువనగిరిటౌన్ : భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రాజెక్ట్ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఖాళీగా ఉన్న 3 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 45 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్ కింద ఖాళీగా ఉన్న 13 ఆయా పోస్టులకు 22 మంది ఇంటర్వ్యూలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిక కమిటీ సభ్యులు జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ మనోహర్, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, భువనగిరి సీడీపీఓ శైలజ పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణను వినియోగించుకోవాలి
భువనగిరిటౌన్ : తెలంగాణ ప్రభుత్వం, ట్రైకార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణను జిల్లాలోని గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి వెంకటయ్య బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైనవారితో పాటు చదువు మధ్యలో ఆపిన గిరిజ యువత ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నుంచి 6 నెలల పాటు వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ (కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ దగ్గర), నల్లగొండ జిల్లా దేవరకొండలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లలో ఈ శిక్షణ ఉంటుందని వివరించారు. ఆసక్తి గల జిల్లా గిరిజన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 30వ తేదీలోపు రాయిగిరిలోని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కా ర్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9866930282 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.


