సీపీఎం నిర్మాణంలో భూపాల్‌రెడ్డి పాత్ర ఎనలేనిది | - | Sakshi
Sakshi News home page

సీపీఎం నిర్మాణంలో భూపాల్‌రెడ్డి పాత్ర ఎనలేనిది

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ ప్రాంతంలో సీపీఎం నిర్మాణంలో దివంగత చింతల భూపాల్‌రెడ్డి పాత్ర ఎనలేనిదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. దివంగత మాజీ సర్పంచ్‌, సీపీఎం మాజీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతల భూపాల్‌రెడ్డి ప్రథమ వర్ధంతిని బుధవారం చౌటుప్పల్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని నాగులకుంట వద్ద నిర్మించిన ఆయన స్మారక స్తూపాన్ని జాన్‌వెస్లీ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆసుపత్రితోపాటు తాగునీటి కోసం కృష్ణా జలాలు, సాగునీటి కోసం పిలాయిపల్లి కాలువ సాధనకు ప్రజలు,రైతులతో కలిసి ఉద్యమాలు నిర్వహించారని గుర్తుచేశారు. భూపాల్‌రెడ్డి సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఆర్టీసీలో బస్సు డ్రైవర్‌గా పనిచేసుకుంటూనే పార్టీని విస్తరించేందుకు పూర్తికాలం పనిచేశారన్నారు. కార్యకర్తలు భూపాల్‌రెడ్డి ఆశయసాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్‌, మండల, పట్టణ కార్యదర్శులు గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్‌, కౌన్సిలర్‌ బత్తుల జయమ్మ, నాయకులు బూరుగు కృష్ణారెడ్డి, కె.నర్సింహ, కల్లూరి మల్లేశం, ఎం.డి.పాష, గుంటోజు శ్రీనివాసచారి, బండారు నర్సింహ, దండ అరుణ్‌కుమార్‌, గోపగోని లక్ష్మణ్‌, బత్తుల శ్రీశైలం, అవ్వారు రామేశ్వరి, బత్తుల దాసు, ధర్మయ్య, బోరెం నర్సిరెడ్డి, అవ్వారు గోవర్దన్‌, చింతల విప్లవ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement