యాదగిరిగుట్ట: శివకేశవులకు నెలవైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక ఆరాధనలు జరిగాయి. సోమవారంతో పాటు కార్తీక మాసం కావడంతో కొండపైన అనుబంధ శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శివాలయంలోని గర్భాలయంలోని మహా శివుడికి, ముఖ మండపంలోని స్పటిక రామలింగేశ్వరస్వామికి శుద్ధ జలం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలతో అర్చన చేపట్టారు. సాయంత్రం శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి సేవను ఊరేగించారు. ఇక శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ప్రధానాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు నిత్య కై ంకర్యాలు కొనసాగాయి.
యాదగిరీశుడి సన్నిధిలో 25వేల మంది భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల సందడి కొనసాగుతోంది. కార్తీక మాసం కావడంతో యాదగిరి క్షేత్రానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కార్తీక మాసం కావడంతో ఆలయంలో కార్తీక ఆరాధనలు నిర్వహించిన భక్తులు, కొండ కింద శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను చేపట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రీస్వామి వారిని 25వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.60,25,391 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
సాహస శిబిరానికి
విద్యార్థినుల ఎంపిక
భూదాన్‌పోచంపల్లి: హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక జాతీయ సాహస శిబిరానికి భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీఫోర్స్‌డ్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ప్రజ్వల, అశ్విత అనే విద్యార్థినులు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలత సోమవారం తెలిపారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాల పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ నెల 18 నుంచి సాహస శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని అన్నారు. విద్యార్థినులను కళాశాల డైరెక్టర్ కల్నల్ రాజా దత్తా, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ ఎన్. పానవి, డాక్టర్ పద్మమ్మ అభినందించారు.


