గ్రీన్‌ దీపావళి జరుపుకుందాం | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ దీపావళి జరుపుకుందాం

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

దీపావళి స్ఫూర్తితో ఎల్‌నినోను ఎదుర్కొందాం దీపావళి స్పూర్తితో ఎల్‌నినోను ఎదుర్కొందాం

పండుగ రోజున ఒక మొక్క నాటాలి..

ప్రకృతిపై రసాయనదాడి..

ప్రకృతిపై రసాయన దాడి..

అవగాహన కల్పించడమే అతిముఖ్యం

దుబారాను తగ్గించుకుందాం

నీటి వనరులను సంరక్షించుకుందాం..

వెలుగులను కాపాడుదాం

వెలుగులను కాపాడుదాం

ఫ మట్టి ప్రమిదలే మన సంప్రదాయం ఫ బాణసంచా కాల్చి కాలుష్యాన్ని పెంచొద్దు

గ్రీన్‌

దీపావళిని

ప్రోత్సహిద్దాం

చీకటిని పారదోలి వెలుగులను నింపే పండుగ దీపావళి. పండుగ రోజున చెవుల పగిలే శబ్దాలతో పొగలు విరజిమ్మే బాణసంచా పేలుళ్లే కాదు.. పర్యావరణహితంగా (ఎకో ప్రెండ్లీ)గా జరుపుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతికి, జీవజాతులకు శాపంగా మారకుండా పండుగ జరుపుకోవడం ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పర్యావరణ హితులు కోరుతున్నారు. ఆ దిశగా మార్పు ప్రతి ఇంటినుంచి ప్రారంభం కావాలి. – కోదాడ

కొత్త నిర్ణయాలతో తారాజువ్వలా దూసుకుపోదాం

కొత్త నిర్ణయాలతో తారాజువ్వులా దూసుకుపోదాం

దీపావళి పర్వదినమంటే కేవలం బాణసంచా కాల్చ డమనే అపోహ నుంచి ముందు బయటకురావాలని పర్యావరణ హితులు అంటున్నారు. దీపావళి పర్వదినానికి అసలైన అర్థం దీపాలను వెలిగించి చీకటి ప్రారదోలడమని అవగాహన కల్పించాలి. మట్టి ప్రమిదలతోపాటు సహజమైన నూనెలను వాడడం వల్ల కాలుష్యాన్ని 90 శాతం తగ్గించవచ్చు. మార్కెట్‌లో దొరుకుతున్న బాణసంచాలో పర్యావరణంతోపాటు మానవుల ఆరోగ్యానికి హాని కలిగించే 10 రకాలలైన విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. వీటికి ప్రత్యామ్నయంగా సీఎస్‌ఐఆర్‌ గుర్తింపు పొందిన ‘గ్రీన్‌ కాకర్స్‌’ (హరిత బాణసంచా) వాడడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.

దీపావళి పర్వదినమంటే కేవలం బాణసంచా కాల్చడమనే అపోహ నుంచి ముందు బయటకురావాలని పర్యావరణ హితులు అంటున్నారు. దీపావళి పర్వదినానికి అసలైన అర్థం దీపాలను వెలిగించి చీకటి ప్రారదోలడమని అవగాహన కల్పించాలి. మట్టి ప్రమిదలతోపాటు సహజమైన నూనెలను వాడడం వల్ల కాలుష్యాన్ని 90 శాతం తగ్గించవచ్చు. మార్కెట్‌లో దొరుకుతున్న బాణసంచాలో పర్యావరణంతోపాటు మానవుల ఆరోగ్యానికి హాని కలిగించే 10 రకాలలైన విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. వీటికి ప్రత్యామ్నయంగా సీఎస్‌ఐఆర్‌ గుర్తింపు పొందిన ‘గ్రీన్‌ కాకర్స్‌’ (హరిత బాణసంచా) వాడడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.

దీపావళి పర్వదినం సందర్భంగా చిన్నారులు ఒకరికొకరు గ్రీన్‌గిఫ్టస్‌ (మొక్కలు) ఇచ్చుకొనే విధంగా చూడాలి. దీనివల్ల పండుగరోజు మొక్కలు నాటిన సంతోషంతోపాటు పర్యావరణ పరిరక్షణపైనా అవగాహన కలుగుతుందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. బాణసంచా వల్ల పెంపుడు జంతువులకు కలిగే హాని చిన్నారులకు వివరిస్తే చాలా వరకు వాటిపై వారికి ఉండే ప్రేమ వల్ల బాణసంచా కాల్చకుండా ఉంటారని వారంటున్నారు. పెద్దలకు, ప్రముఖులకు దీపావళి కానుకగా ఇండోర్‌ప్లాంట్స్‌ బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

బాణసంచా కాల్చడం వల్ల ప్రకృతిపై రసాయన దాడి జరుగుతుంది. టపాసులు కాల్చినప్పుడు సల్పర్‌ డయాకై ్సడ్‌, కార్బన్‌మెనాకై ్సడ్‌ భారీగా విడుదల అవుతాయి. దీనికితోడు ఆకుపచ్చ రంగు రావడానికి బేరియం, ఎరుపురంగు కోసం స్ట్రాంటియం, తెల్లని మెరుపుల కోస అల్యూమినియం, సీసం వంటి భారీ లోహాలను వాడుతున్నారు. వీటిని పేల్చినప్పుడు 140 డెసిబుల్స్‌కు పైగా శబ్దం వస్తుంది. వీటివల పక్షులు తమ గూళ్లను వదిలిపారిపోతాయి. టపాసుల వ్యర్ధాలు నీటి వనరుల్లో కలవడం వల్ల జల, భూ కాలుష్యం ఏర్పడుతుంది. వాతావరణంలోకి చేరి తీవ్ర శ్వాసకోస వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉంది.

బాణసంచా కాల్చడం వల్ల ప్రకృతిపై రసాయన దాడి జరుగుతుంది. టపాసులు కాల్చినప్పుడు సల్పర్‌ డయాకై ్సడ్‌, కార్బన్‌మెనాకై ్సడ్‌ భారీగా విడుదల అవుతాయి. దీనికితోడు ఆకుపచ్చ రంగు రావడానికి బేరియం, ఎరుపురంగు కోసం స్ట్రాంటియం, తెల్లని మెరుపుల కోస అల్యూమినియం, సీసం వంటి భారీ లోహాలను వాడుతున్నారు. వీటిని పేల్చినప్పుడు 140 డెసిబుల్స్‌కు పైగా శబ్దం వస్తుంది. వీటివల పక్షులు తమ గూళ్లను వదిలిపారిపోతాయి. టపాసుల వ్యర్ధాలు నీటి వనరుల్లో కలవడం వల్ల జల, భూ కాలుష్యం ఏర్పడుతుంది. వాతావరణంలోకి చేరి తీవ్ర శ్వాసకోస వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉంది.

బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. ప్రకృతిని కాపాడుకుంటూనే దీపావళి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకొనేలా అవగాహన కల్పించాలి. మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించుకోవాలి. చిన్నారులకు మొక్కలను పండుగ బహుమతిగా ఇచ్చి వాటిని నాటేలా చూడాలి.

– కొల్లు లక్ష్మీనారాయణ, పర్యావరణ ప్రేమికుడు, కోదాడ

ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసర వస్తువులతోపాటు అన్నిరకాల ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉంది. దీనికితోడు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. వీటిని దృష్టితో పెట్టుకొని ఈ పండుగ నుంచే దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొవడానికి పొదుపే తారక మంత్రంగా వాడుకోవాలి. ఆర్భాటపు వేడుకలకు దూరంగా ఉండాలి.

కోదాడ : శ్రీకృష్ణుడు నరకాసురుడనే రాక్షసుడితో పోరాడుతూ పడిపోతాడు.. ఆ సమయంలో సత్యభామ బాణం ఎక్కుపెట్టి నరకాసురుడిని సంహరించడంతోనే చీకట్లు పోయి వెలుగుల పండుగ దీపావళి వచ్చిందని చరిత్రకారులంటున్నారు. సత్యభామ పోరాటస్పూర్తితో ప్రస్తుతం మానవ మనగడకు ముప్పుగా మారుతున్న ఎల్‌నినోపై పోరాటం సాగించాలి. ముంచుకొస్తున్న ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించాలంటే ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లి జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి.

ఎల్‌నినో ప్రభావంతో తాగునీటికి కటకట ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నందున ఉన్న కొద్దిపాటి తాగునీటి వనరులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. చుక్క నీటిని కూడా వృథా చేయవద్దు. ఇంట్లో నల్లాల లీకేజీలు లేకుండా చూసుకోవాలి. వాహనాలను కడగడం, సిమెంట్‌ రోడ్లపై రోజు నీరు చల్లడం మానుకోవాలి. జల సంరక్షణపై పిల్లలకు అవగాహన కల్పించాలి.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో విద్యుత్‌కు తీవ్ర కొరత ఏర్పడుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే విద్యుత్‌ పొదుపు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చీకట్లు కమ్ముకోక ముందే వెలుగుల కోసం జాగ్రత్త పడాలి. అవసరం లేని చోట విద్యుత్‌ దుబారాను తగ్గించాలి.

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో విద్యుత్‌కు తీవ్ర కొరత ఏర్పడుతుంది. అందుకోసం ఇప్పటి నుంచే విద్యుత్‌ పొదుపు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చీకట్లు కమ్ముకోక ముందే వెలుగుల కోసం జాగ్రత్త పడాలి. అవసరం లేని చోట విద్యుత్‌ దుబారాను తగ్గించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement