ఇందిరమ్మ ఇళ్లలో వెలుగుల దీపావళి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లలో వెలుగుల దీపావళి

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

పండుగ వాతావరణంలో నిర్వహించాలి

సాక్షి, యాదాద్రి : జిల్లా వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి శనివారం తెలిపారు. ప్రతి ఇంటి ఎదుట గోడపై మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి లోగో స్టిక్కర్‌ అతికించి లబ్ధిదారుల వివరాలను రాయించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ముంగిట దీపాలు వెలిగించి, అధికారిక మొబైల్‌ యాప్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.

ఫ మొదటి విడతలో మంజూరైన 9,618 ఇళ్లలో ఇప్పటికే 5,420 పూర్తి

ఫ కొత్త ఇళ్లలో దీపాలు వెలిగించి, సెల్ఫీలు దిగి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశం

రామన్నపేట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసింది. నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, వారి ఇళ్లలో దీపావళి వెలుగులు నింపింది. మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో సగానికి పైగా నిర్మాణాలు పూర్తయి విజయవంతంగా గృహప్రవేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో గృహప్రవేశాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లల్లో ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ పేరిట ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని గృహనిర్మాణ శాఖ నిర్ణయించింది.

లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు..

మొదటి విడత ఇందిరమ్మ పథకంలో భాగంగా జిల్లాకు 9,618 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 8,121 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 5,420 పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు సంబంధించి స్లాబ్‌ లెవల్‌ వరకు రూ.3.40 లక్షల వరకు బిల్లులను ప్రభుత్వం నేరుగా డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) పద్ధతిలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రూ.12 వేలు కూడా చెల్లించారు. ఈనేపథ్యంలో నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లల్లో ఆదివారం సాయంత్రం ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ అని పూలతో లోగో ఏర్పాటు చేసి దీపాలు వెలిగించాలి. ఈ ఆనంద క్షణాలను కుటుంబ సభ్యులంతా కలిసి సెల్ఫీ దిగి, ‘ఇందిరమ్మ ఇళ్లు’ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేయాలి. స్థానిక సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement