యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. శనివారం స్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు శయనోత్సవ సేవ నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.


