వేగంగా ఎంఎంటీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

వేగంగా ఎంఎంటీఎస్‌

Nov 8 2026 10:42 AM | Updated on Nov 8 2026 10:42 AM

నిర్ణీత గడువులోగా పూర్తిచేస్తాం

ఆధునిక హంగులతో యాదాద్రి స్టేషన్‌

యాదగిరిగుట్ట రూరల్‌ : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం నిర్మిస్తున్న యాదాద్రి ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2 ట్రాక్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి, వంగపల్లి వరకు విస్తరిస్తున్న ఈ థర్డ్‌ రైల్వేట్రాక్‌ పనులు వేగం పుంజుకున్నాయి. రూ.412.26 కోట్ల అంచనా వ్యయంతో రెండు దశల్లో ప్రారంభమైన ఈ పనులు మొదటి దశలో భాగంగా యాదాద్రి నుంచి పగిడిపల్లి వరకు సాగుతున్నాయి. రెండవ దశ కింద పగిడిపల్లి నుంచి బీబీనగర్‌, ఘట్‌కేసర్‌ వరకు ట్రాక్‌ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తున్నారు.

18,625 హెక్టార్ల భూసేకరణ

ఈ ఎంఎంటీఎస్‌ రైల్వే ట్రాక్‌ పనుల కోసం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో దాదాపు 18.625 హెక్టార్ల (46 ఎకరాలకుపైగా) భూ సేకరణ పూర్తయ్యింది. భూనిర్వాసితులకు నష్ట పరిహారం ఇచ్చే పనుల్లో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్రాక్‌ మార్గంలో 59 చిన్న వంతెనలు, ఒక పెద్ద వంతెన నిర్మాణానికి సంబంధించి, ఎర్త్‌వర్క్‌, మట్టి పనులు, సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌, విద్యుత్‌ పనులు, బాలాస్ట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టును రైల్వే వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌, సంస్ధ వారు నిర్మిస్తున్నారు. దీనిలో తెలంగాణ ప్రభుత్వం మూడింట రెండు వంతులు నిధులు భరిస్తుండగా, రైల్వే శాఖ మూడింట ఒక వంతును భరిస్తుంది. ఈ మార్గంలో ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, పగిడిపల్లి, భువనగిరి, యాదాద్రి, అదనంగా వంగపల్లి స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు జరుగుతున్న ఎంఎంటీఎస్‌ ట్రాక్‌ పనులు గడువులోగా పూర్తిచేస్తాం. యాదాద్రి స్టేషన్‌ను కూడా అన్ని హంగులతో నిర్మిస్తున్నాం. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు, ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. – ప్రదీప్‌, రైల్వే సీనియర్‌ పీఆర్‌ఓ

ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు పనులు నడుస్తున్న నేపథ్యంలో యాదాద్రి రైల్వే స్టేషన్‌ను ఆధునిక హంగులతో అధికారులు నిర్మిస్తున్నారు. రూ.24.45 కోట్లు వెచ్చించి, అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం ద్వారా, ఈ స్టేషన్‌ను పునర్నిర్మిస్తున్నారు. స్టేషన్‌లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీలక్ష్మీనరసింహస్వామి, ఇతర చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. రాజగోపురం, సంప్రదాయ తోరణం, ఎస్కలేటర్లు, పార్కింగ్‌, వెయిటింగ్‌ హాళ్ల పనులు సాగుతున్నాయి.

ఫ ప్రాజెక్టు ఫేజ్‌–2 పనులు ముమ్మరం

ఫ ఘట్‌కేసర్‌–యాదాద్రి, వంగపల్లి వరకు థర్డ్‌ ట్రాక్‌ నిర్మాణం

ఫ 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామంటున్న రైల్వే అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement