విద్యార్థి దశ నుంచే సత్ప్రవర్తన అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి దశ నుంచే సత్ప్రవర్తన అలవర్చుకోవాలి

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

● గరికపాటి నరసింహారావు

దేవరకొండ: విద్యార్థులు తమ విద్యార్థి దశ నుంచే మంచి నడవడికను అలవర్చుకోవాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సూచించారు. శనివారం దేవరకొండ పట్టణంలోని కృష్ణవేణి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా వికాసం కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో విద్యార్థులకు, ఇప్పటి విద్యార్థులకు చాలా తేడా ఉందన్నారు. ఆ కాలంలో విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉండేవారని గుర్తుచేశారు. విద్యార్థులు గురువులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినడంతో పాటు అందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వాలన్నారు. తాము ఎంచుకున్న లక్ష్య సాధనకు నిరంతరం కృషిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ ఎం.ఎం. షరీఫ్‌, సీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ నవీన్‌గౌడ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు

భువనగిరి : భువనగిరి పట్టణానికి చెందిన తైక్వాండో అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుర్రం కృష్ణ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఆగస్టులో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన లార్జెస్ట్‌ తైక్వాండో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కార్యక్రమంలో 533 మంది పాల్గొనగా.. కృష్ణ పుమ్సే, క్యూరీగి, పంచెన్‌, బ్లాక్స్‌, కిక్స్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ వంటి విభాగాలను ఒకేసారి ప్రదర్శించి వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సాధించారు. శనివారం హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సర్టిఫికెట్‌, మెడల్‌ అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement