శాంతిభద్రతల పరిరక్షణకే తొలిప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణకే తొలిప్రాధాన్యం

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

భూదాన్‌పోచంపల్లి: శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని డీఐజీ జోయెల్‌ డేవిస్‌ పోలీస్‌ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌ను డీఐజీ సందర్శించారు.స్టేషన్‌ నిర్వహణ, డైరీ, రికార్డులు, సిబ్బంది విధులు, వాహనాల నిర్వహణ, కోర్టు రికార్డులు, కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌, చౌటుప్పల్‌ డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, రూరల్‌, పట్టణ సీఐలు మన్మధకుమార్‌, సతీష్‌రెడ్డి, రామన్నపేట సీఐ రవి, స్థానిక ఎస్‌ఐ జడ జగన్‌ , మహిళా ఎస్‌ఐ లైలా, ఏఎస్‌ఐలు శంకర్‌నాయక్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫ డీఐజీ జోయెల్‌ డేవిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement