లాల్‌ షా వలిబాబా దర్గా గంధం ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

లాల్‌ షా వలిబాబా దర్గా గంధం ఊరేగింపు

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణంలోని సమద్‌ చౌరస్తా వద్ద గల హజ్రత్‌ లాల్‌ షా వలి బాబా ఉర్సు ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. అహ్మద్‌ జమాల్‌ షరీఫ్‌ ఫారోఖి పర్యవేక్షణలో, ముతవల్లీలు ఇంతియాజ్‌, ఎండీ ఇస్తియాఖ్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఇస్లాంపుర మసీదు నుంచి ఆజాద్‌ రోడ్డు మీదుగా దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం బాబాకు పూల చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉర్సు మతసామరస్యానికి, శాంతికి ప్రతీక అని ముతవల్లి ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement