చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

భువనగిరి: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆరిఫ్‌ అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్‌ కాన్సెప్ట్‌ హైస్కూల్‌లో సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. మానవ అక్రమ రవాణా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఫోన్‌ వాడకం పై ప్రత్యేక నిఘాఉంచాలన్నారు. న్యాయ సలహాలు, సహాయం కోసం 15100,చైల్డ్‌లైన్‌ 1098 నంబర్‌ను సంప్రదించాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై భాస్కర్‌రెడ్డి, చైల్డ్‌ లైన్‌ సిబ్బంది దశరథ, పాఠశాల చైర్మన్‌ పగిడాల జలంధర్‌రెడ్డి, కరస్పాండెంట్‌ పురేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య పూజలు నిర్వహించారు. ఉదయాన్నే శ్రీస్వామికి సుప్రభాతం చేపట్టి, స్వయంభూ మూర్తులకు నిజాభిషేకం జరిపించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు సహస్ర నామార్చన, కుంకుమార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలో బంగారు ఉత్సవమూర్తులకు అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వా హన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం చేపట్టారు. సాయంత్రం వేళ శ్రీస్వామి అమ్మవార్ల వెండి జోడు సేవను ఊరేగించి, రాత్రి పవళింపు సేవ జరిపి ఆలయాన్ని మూసివేశారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాజాపేట : రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. గురువారం రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు వచ్చే యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు బాలరాజుగౌడ్‌, విఠల్‌నాయక్‌, మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ గొల్లపల్లి రాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మహేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌ రవికిరణ్‌కుమార్‌, ఎంపీడీఓ నాగవేణి, ఏపీఎం మురహరి, నాయకులు పెంటయ్యగౌడ్‌, ఇంజ నరేష్‌ పాల్గొన్నారు.

పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లికి గురువారం అమెరికా, కెనడా దేశాలకు చెందిన 10 మంది టూరిస్ట్‌లు వచ్చారు. టూరిజం పార్కును సందర్శించి అక్కడ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించారు. మగ్గంపై పనిచేస్తే చేనేత కార్మికుడికి లభిస్తున్న కూలి, జీవన విధానాలు, ఇక్కత్‌ వస్త్రాల ప్రాముఖ్యత, పోచంపల్లి భూదానోద్యమ చారిత్రక నేపఽథ్యాన్ని వారు అడిగి తెలుసుకొని అభినందించారు. ఇండియా పర్యటనలో భాగంగా పోచంపల్లికి వచ్చినట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement