నల్లగొండ : డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ఏకమై దండోరా వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో నిర్వహించిన ‘డ్రగ్స్‌పై ఏపూరి దండోరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో యువత భవిష్యత్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లోనూ మాదకద్రవ్యాల సరఫరాపై ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీడ్రగ్స్‌పై ఏపూరి దండోరాశ్రీ నినాదంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కేవలం ఒక సభగా చూడొద్దని, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతి గడపకు అవగాహన కల్పించే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపూరి ఫౌండేషన్ చేస్తున్న పోరాటానికి వివిధ ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు.
ఫ ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న


