మల్లఖంబ్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

మల్లఖంబ్‌ ఎంపిక పోటీలు

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

చౌటుప్పల్‌ : పట్టణంలోని ట్రినిటీ స్కూల్‌లో మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌జీఎఫ్‌) అండర్‌–14, అండర్‌–17 విభాగాలలో మల్లఖంబ్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎంఈఓ గురువారావు ప్రారంభించారు. అండర్‌–14 విభాగంలో ఆరుగురు బాలికలు, ఆరుగురు బాలురు, అండర్‌–17 విభాగంలో ఆరుగురు బాలురు, ఆరుగురు బాలికలు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఎస్‌జీఎఫ్‌ మండల కార్యదర్శి లింగయ్య, కొయ్యలగూడెం ప్రదానో పాధ్యాయుడు మట్టయ్య, ట్రినిటీ స్కూల్‌ చైర్మన్‌ కెవిబి. కృష్ణారావు, ప్రిన్సిపాల్‌ ఉజ్జిని మంజుల, మల్లఖంబ్‌ అసొసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి గోపా ల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement