ఐదున్నర దశాబ్దాల ఆత్మీయ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

ఐదున్నర దశాబ్దాల ఆత్మీయ సమ్మేళనం

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

నిడమనూరు : నల్లగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 1970–72లో ఇంటర్మీడియట్‌ చదివిన వారు 54 సంవత్సరాల తర్వాత మంగళవారం నిడమనూరు మండలం శాఖాపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. నిడమనూరు మాజీ ఎంపీపీ చేకూరి హన్మంతరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 65 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో రాజకీయ ప్రముఖులు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, బీరవోలు సోమిరెడ్డి, గాదె వినోద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఐదున్నర దశాబ్దాల తర్వాత ఒకేచోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతీక్‌రెడ్డి జూనియర్‌ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ గోనారెడ్డి, రేపాల రాంమ్మూర్తి, అక్కినపల్లి మురళీధర్‌రావు, అశోక్‌రెడ్డి సీతారామారావు, జావిద్‌, ముప్పారం జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement