‘ఏ’ గ్రేడ్‌ రకానికి మద్దతు ధర రూ.2,461 | - | Sakshi
Sakshi News home page

‘ఏ’ గ్రేడ్‌ రకానికి మద్దతు ధర రూ.2,461

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

సాక్షి,యాదాద్రి : ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని, ఏ గ్రేడ్‌ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర చెల్లిస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి వెల్లడించారు. 2026–27 ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో సుమారు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ఐకేపీ, మహిళా సమాఖ్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా దాదాపు 325 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏడు రకాల సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాలకు వచ్చే ధాన్యం వివరాలను రోజూ ట్యాబ్‌లలో నమోదు చేయాలన్నారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైన గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, తేమ యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాల దష్ట్యా రైతులు కూడా టార్పాలిన్లు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ హరికష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సహకార అధికారి మురళి, లీగల్‌ మెట్రాలజీ అధికారులు, అదనపు డీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement