చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్‌! | - | Sakshi
Sakshi News home page

చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్‌!

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

సాంకేతిక సమస్యలతో..

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వసూళ్లు

సాక్షి, యాదాద్రి: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వసూళ్ల పర్వం బహిరంగంగానే సాగుతోంది. చేతులు తడపనిదే దస్త్రాలు ముందుకు కదలడం లేదు. అదనపు డబ్బులు ఇవ్వకపోతే అధికారులు రకరకాల కొర్రీలుపెడుతూ తిప్పుకుంటున్నారు. దీనికి తోడు అడుగడుగునా డాక్యుమెంట్‌ రైటర్ల హవా, మరో వైపు కార్యాలయాల్లో వసతుల లేమి.. వెరసి క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.

రైటర్లదే రాజ్యం..

జిల్లాలోని యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, భువనగిరి, బీబీనగర్‌, మోత్కూరు, రామన్నపేట తదితర ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల చుట్టూ పదుల సంఖ్యలో డాక్యుమెంట్‌ రైటర్ల మడిగెలు వెలిశాయి. ఓపెన్‌ ప్లాట్లు, ఇళ్ల క్రయవిక్రయాలు, మార్టిగేజ్‌, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌.. లావాదేవీ ఏదైనా సరే అంతా డాక్యుమెంట్‌ రైటర్లే చక్కబెడుతున్నారు.

● భువనగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 30నుంచి 40 వరకు స్లాట్‌ బుక్కింగ్‌ జరుగుతున్నాయి. క్రయవిక్రయదారులు త్వరగా రిజిస్ట్రేషన్‌ కావాలని డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. వీరు ఒక్కో డాక్యుమెంట్‌కు రూ. 2వేల నుంచి రూ. 5 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వీరికి కార్యాలయ సిబ్బంది సహకరిస్తున్నారు. అద్ధె భవనంలో కొనసాగుతున్నఈ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో మంచినీరు, ఇతర వసతులు లేవు.

● రామన్నపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు ఐదు నుంచి 8 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతాయి. అందులో సగం వరకు మ్యారేజ్‌ , మార్ట్‌ గేజ్‌ రిజిస్ట్రేషన్లు ఉంటాయి.

● చౌటుప్పల్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో సరాసరి 25 –30 మధ్యన రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ఇక్కడ మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో క్రయవిక్రయదారులు ముఖ్యంగా మహిళలు అవస్థలు పడుతున్నారు. కనీసం మంచినీటి వసతి లేదు.

● యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో సుమారు 20కి పైగా రైటర్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీరు కంప్యూటర్‌ ఆపరేటర్లుగా డాక్యుమెంట్‌ ప్రిపేర్‌ చేయడం, ఫొటో క్యాప్చర్‌ వంటి పనులు చేస్తారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది గానీ అధికారులు గానీ సెలవుల్లో ఉంటే డాక్యుమెంట్‌ రైటర్లే కంప్యూటర్‌ వద్దకు వచ్చి పనులు చేస్తుంటారు.

ఫ అంతా డాక్యుమెంట్‌ రైటర్ల చేతుల్లోనే..

ఫ అదనపు చెల్లింపులు లేకపోతే తీవ్ర జాప్యం

ఫ చలాన్‌కు అదనంగా రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు

డాక్యుమెంట్‌ రైటర్‌ల ద్వారా వెళితే దస్త్రాల్లో కొర్రీలు లేకుండా పని పూర్తవుతుంది. అయితే, ఇందుకోసం వారు కొనుగోలుదారుల నుంచి భారీగానే వసూలు చేస్తున్నారు. ఇళ్లు, ఇంటి స్థలాలకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సి న నగదు (చలాన్‌) కాకుండా, ఒక్కో డాక్యుమెంట్‌కు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి వెళ్లి ఫొటో దిగి, సంతకాలు పెట్టడం వరకే వారి పని.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మిగతా తతంగమంతా డాక్యుమెంట్‌ రైటర్లే చూసుకుంటున్నారు. ఒకవైపు అధికారుల, రైటర్ల జేబులు నింపలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సర్వర్‌, సాంకేతిక సమస్యలు మరింత కలవరపెడుతున్నాయి. సర్వర్‌ మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement