సెల్లార్లలో వ్యాపారం.. రోడ్లపై పార్కింగ్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్లార్లలో వ్యాపారం.. రోడ్లపై పార్కింగ్‌

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

తనిఖీలను అడ్డుకుంటున్నారని..

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణంలో వాణిజ్య కార్యకలాపాలు రోజురోజుకూ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, మౌలిక వసతుల లేమి ప్రజలను నరకయాతనకు గురిచేస్తోంది. ప్రధాన రహదారుల వెంట వెలిసిన షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లు పార్కింగ్‌ స్థలాలను వ్యాపార నిమిత్తం మళ్లించడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. దీనికి తోడు ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చింది. తద్వారా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పార్కింగ్‌కు అనుమతులు..

పట్టణంలోని పలు వాణిజ్య భవనాల్లో సెల్లార్లను పార్కింగ్‌ కోసం కేటాయిస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తూ భవన అనుమతులు పొందుతున్నారు. కానీ, నిర్మాణం పూర్తయ్యాక ఆ స్థలాలను యథేచ్ఛగా దుకాణాలుగా మార్చి వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారు. కొన్ని చోట్ల పార్కింగ్‌ స్థలాల ఎదుట గేట్లు ఏర్పాటు చేసి ఆక్రమిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు తమ వాహనాలను ప్రధాన రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. ఫలితంగా రద్దీ వేళల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

అడ్డదిడ్డంగా పార్కింగ్‌

దుకాణాల ముందు వాహనాలను అడ్డదిడ్డంగా నిలపడమే కాకుండా, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి డబ్బాలు, పండ్ల షాపులు, ఇతర తాత్కాలిక వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాదచారులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని రోడ్లపైనే నడవాల్సి వస్తోంది.

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో సెల్లార్లను వ్యాపారాలకు వాడుతున్న 21 మంది భవన యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రావడం లేదు. నోటీసులు అందుకున్న కొందరు వ్యాపారులు అధికారులను ప్రసన్నం చేసుకుంటూ తనిఖీలను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ భువనగిరి పట్టణంలో నిబంధనలు బేఖాతరు

ఫ ఫుట్‌పాత్‌లు సైతం ఆక్రమణ

ఫ తీవ్రమవుతున్న ట్రాఫిక్‌ సమస్య

ఫ 21మందికి నోటీసులిచ్చినా మారని పరిస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement