రియల్‌ మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

రియల్‌ మాయాజాలం

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

ఈ వెంచర్‌లో ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారు అత్యధికంగా ఆర్మీ ఉద్యోగులే ఉండడం గమనార్హం. వీరితో పాటుగా ఐటీ ఉద్యోగులు, సామాన్యులు సైతం ప్లాట్‌లను కొనుగోలు చేశారు. కాగా ఈ వెంచర్‌లో ప్లాట్‌లను కొనుగోలు చేసిన వారిలో తమిళనాడు, ఆంధ్రపదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, విజయవాడ, మార్కాపురం, తెనాలి, రాజమండ్రి, అనంతపురం, రాజస్థాన్‌, తెలంగాణలో హైద్రాబాద్‌, భువనగిరి ప్రాంతాల వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వెంచర్‌లో సుమారుగా వంద మంది వరకు డబ్బులు చెల్లించినా ప్లాట్లు ఇవ్వలేదని, చెబుతున్నారు. తమ ప్లాట్లను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌ : జిల్లాలో కొంతమంది రియల్టర్‌లు కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని ప్లాట్లను వారికి అప్పగించకుండా మోసం చేస్తున్నారు.. తాజాగా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో ఓ రియల్‌ సంస్థ గత పన్నెండేళ్ల క్రితం ఓ వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్‌లో సామాన్యులకు, ఈఎంఐ రూపంలో ఆశ చూపి, తక్కువ ధరలో వస్తుందని, బ్రోచర్‌లను చూపించి, ప్లాట్‌లను విక్రయించారు. తీరా ప్లాట్‌లను తీసుకున్న తర్వాత, పూర్తిగా డబ్బులు చెల్లించినా, విక్రయదారులకు మాత్రం ప్లాట్‌ను ఇవ్వడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని, తమకు మాత్రం పొజిషన్‌ ప్లాట్‌లను ఇవ్వడం లేదని ప్లాట్‌లు తీసుకున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెంచర్‌ యాజమాన్యం, తుర్కపల్లి, పెద్దతండాతో పాటుగా, రుస్తాపురం, రాళ్లజనగాం, జంగంపల్లి, తిమ్మాపురం శివారుల వరకు సుమారుగా 200 ఎకరాల వరకు పలు సర్వే నెంబర్‌లల్లో, పన్నెండేళ్ల క్రితం వెంచర్‌ను ఏర్పాటు చేశారు.

ఆర్మీ ఉద్యోగులే అధికం..

ఫ తుర్కపల్లి మండలంలో వెంచర్‌

ఏర్పాటు చేసిన ప్రముఖ సంస్థ

ఫ డబ్బులు చెల్లించినా..

ప్లాట్‌లు ఇవ్వని వైనం

ఫ ప్లాట్‌లు చూపించకపోవడంతో లబోదిబోమంటున్న బాధితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement