యాదగిరిగుట్ట రూరల్: మోటకొండూర్ మండల కేంద్రం పర్యటనకు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు యాదగిరిగుట్ట మండంలంలోని మహబూబ్‌పేట గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయా అని మహిళలను అడిగారు. కేసీఆర్ పాలన బాగుందా..? రేవంత్ రెడ్డి పాలన బాగుందా.. అని, పెన్షన్‌లు ఎంత వస్తున్నాయి? మహిళలకు రూ.2500 వస్తున్నాయా? అని అడిగారు. అంతకుముందు ఆయనకు వంగపల్లి గ్రామం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీగా మోటకొండూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మిట్ట వెంకటయ్య, బీమగాని నర్సింహ, కవిడె మహేందర్, కానుగు లక్ష్మణ్, మదర్ డెయిరీ డైరెక్టర్ కందాల అలివేల రంగారెడ్డి, ఉపసర్పంచ్ సోకం అనిత పాల్గొన్నారు.


