నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

భువనగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23న గణనాథుల నిమజ్జనం జరగనుంది. గతేడాది జిల్లాలో సుమారు 4 వేల వరకు మండపాలు ఏర్పాటు కాగా, ఈ సారి ఆన్‌లైన్‌ ద్వారా 3,695 మండపాలు నమోదయ్యాయి. మ్యాపింగ్‌, జియో ట్యాగింగ్‌తో భద్రత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలోని అన్ని మండపాలను జియో ట్యాగింగ్‌ చేసి, గూగుల్‌ మ్యాప్‌లో గుర్తించారు. అంతేకాకుండా శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో సాగేలా ఆయా మార్గాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి చాలా చెరువుల్లో నీరు లేకపోవడంతో నీటి లభ్యత ఉన్న ప్రధాన చెరువులు, జలాశయాలను మాత్రమే నిమజ్జనానికి ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో క్రేన్లు, బారికేడ్లు, లైటింగ్‌, తాగునీరు, బోటింగ్‌, అగ్నిమాపక శకటాలు, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఉత్సవాల్లో డీజేల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

నిమజ్జనానికి ఎంపిక చేసిన చెరువులివే..

భువనగిరి పట్టణంలో పెద్ద చెరువు, బస్వాపురం చెరువు, రాయగిరి, బీబీనగర్‌ చెరువు, పెద్ద యాదగిరిగుట్ట మండలం కందుకూరు చెరువు, చౌటుప్పల్‌ మండలం మల్కాపురం చెరువు, పోచంపల్లి చెరువు, రామన్నపేట మండలం తుమ్మలగూడెం చెరువు, వలిగొండ మండలం సంగెం వద్ద మూసీ నది, మోత్కూర్‌ చెరువు, యాదగిరిగస్టీ వద్ద నల్ల చెరువు, గోధుమకుంట, ఆలేరులోని సాయిగూడెం చెరువు, ఆలేరు మండలంలోని బాహుపేటవద్ద గోధుమకుంటలో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు

ఫ ఉత్సవాల్లో డీజేల వాడకం నిషేధం

సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం

వినాయక నిమజ్జనం ప్రశాంతవాతావరణంలో జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే మండలపాలను జియో ట్యాగింగ్‌ చేయడం పూర్తయింది. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా శోభాయాత్ర జరిగే మార్గంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఉంటుంది.

– రవీందర్‌, డీఎస్పీ, భువనగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement