ప్రశ్నిస్తే కేసులు.. అడిగితే అరెస్ట్‌లు | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే కేసులు.. అడిగితే అరెస్ట్‌లు

Sep 21 2026 7:17 AM | Updated on Sep 21 2026 7:17 AM

మోటకొండూర్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వ కుంభ కోణాలను, తప్పులపై ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రజల సమస్యలను, ఇచ్చిన హామీలను అడిగితే కేసులు పెడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం మోటకొండూర్‌ మండల కేంద్రంలో సిరబోయిన మల్లేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో 150 మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ.. హామీలు అమలు చేతకాక సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రోజుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తే.. ప్రస్తుతం 7 గంటలు మాత్రమే, అది కూడా లోఓల్టేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తుంటే కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డికి కనిపించటం లేదా అని నిలదీశారు. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని ఎప్పులు ఎన్నికలు వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వచ్చిన హరీష్‌ రావుకు పార్టీ శ్రేణులు హైస్కూల్‌ వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా సభా స్థలానికి వచ్చారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సభలో పార్టీలో చేరిన 150 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మాజీ ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి అండ్‌ కో కలిసి భూదందాలు చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే భూదందాలలో పాటు, క్రషర్‌లు, చెరువు మట్టి, సెటిల్‌మెంట్‌లు, దోపిడీలకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, క్యామ మల్లేష్‌, మహేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, విద్యాసాగర్‌, ఎర్రోల శ్రీనివాస్‌, బాలు, కల్లూరి రామచంద్రారెడ్డి, బొట్ల యాదయ్య, అనంతుల శోభన్‌రెడ్డి, గాజుల వెంకటేష్‌, తండ రాజు, శ్రీకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు.

ఫ బీఆర్‌ఎస్‌ నాయకులను

భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

ఫ మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement