యువత చెంతకు కంపెనీలు | - | Sakshi
Sakshi News home page

యువత చెంతకు కంపెనీలు

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

19న కోదాడలో మెగా జాబ్‌మేళా

3,500కు పైగా యువతకు

ఉద్యోగావకాశాలు

మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడి

భానుపురి (సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత యువతలో ప్రతిభకు కొదవ లేదని.. ఉపాధి కల్పించే లక్ష్యంతో కంపెనీలను వారి చెంతకు తీసుకొస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్‌న్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ నెల 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా ఏర్పాట్లపై మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థుల విద్యార్హత, నైపుణ్యాలకు అనుగుణంగా ఒక్కొక్కరు ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోదాడలో నిర్వహించే జాబ్‌మేళాకు సుమారు 300 కంపెనీలను ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖ, సింగరేణి సంస్థ సమన్వయంతో ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాబ్‌మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై ఎంపికై న అభ్యర్థులకు ఆఫర్‌ లెటర్లు అందజేస్తారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement