భువనగిరి: నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయవద్దని జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. మంగళవారం బీబీనగర్ పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్ శ్యామ్ సుందర్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీస్ చైర్మన్ శ్యామ్‌గౌడ్ పాల్గొన్నారు.
సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
భువనగిరిటౌన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు హిందూ–ముస్లింల ఘర్షణగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్ విమర్శించారు. మంగళవారం భువనగిరిలో సీపీఎం నేత సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో కె. నర్సింహ, బట్టుపల్లి అనురాధ, బాలరాజు, బట్టు రామచంద్రయ్య, వెంకటేష్, సురేష్, అనిల్ కుమార్, అంజయ్య, వి.వెంకటేష్ పాల్గొన్నారు.


