ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం ఇవ్వాలి

Sep 11 2026 12:02 PM | Updated on Sep 11 2026 12:02 PM

930పి జాతీయ రహదారి

భూ నిర్వాసితుల డిమాండ్‌

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మండలం మీదుగా వెళ్తున్న 930పి గౌరెల్లి–భద్రాద్రి జాతీయ రహదారి భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం ఇవ్వాలని అఖిలపక్షాల రైతు నాయకుడు పాక మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోచంపల్లి మండలం పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలతో పాటు చౌటుప్పల్‌లో ఎకరానికి రూ.కోటికి పైగా పరిహారం ఇస్తున్నారని అన్నారు. అంతేకాక వలిగొండలో రీజినల్‌ రింగ్‌రోడ్డు భూ నిర్వాసితులకు రూ.50 లక్షలకు పైగా పరిహారం చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పోచంపల్లి మండల రైతులకు మాత్రం ఎకరానికి రూ.24లక్షలు నిర్ణయించడం సరికాదన్నారు. పరిహారం పెంచాలని కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పరిహారం పెంచిన తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు సామ మధుసూధన్‌రెడ్డి, కోట రాంచంద్రారెడ్డి, చుక్క శంకర్‌, ఇటమోని మహేశ్‌, వారాల శేఖర్‌రెడ్డి, బానాల ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement