ప్రత్యేక కేటాయింపులు ఇలా..
ఆలేరురూరల్: విద్యార్థులకు గణిత బోధనను సులభతరం చేయడంతో పాటు, సైన్స్ ప్రయోగాలతో వారిలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపరిచిన రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పీఎంశ్రీ పాఠశాలలకు సైన్స్, గణిత కిట్ల కొనుగోలు కోసం నిధులను మంజూరు చేసింది. దీంతో ఇప్పటివరకు కేవలం పుస్తకాల చదువుతోనే సరిపెట్టుకున్న విద్యార్థులకు ఇకపై ప్రయోగాత్మక విద్య అందనుంది.
15లోగా కిట్ల కొనుగోలు
సైన్స్ బోధనలో ప్రయోగ పాఠాలు అత్యంత కీలకం. అలాగే గణితంలో కూడా పరికరాల ద్వారా నేర్పిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇవి ఎంతో అవసరం. ఈ మేరకు జిల్లాలో ఎంపికై న 25 పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలకు కిట్ల కొనుగోలు కోసం రూ. 10,50,000 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయ్యాయి. ఈనెల 15వ తేదీలోగా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. నిబంధనల ప్రకారం.. ఈ ఖర్చుల్లో జనరల్ కేటగిరీ కింద 72 శాతం, ఎస్సీ కేటగిరీ కింద 17 శాతం, ఎస్టీ కేటగిరీ కింద 11 శాతం నిధులకు సంబంధించిన బిల్లులను ఆయా పాఠశాలలు సమర్పించాల్సి ఉంటుంది.
మౌలిక వసతుల మెరుగుకు నిధులు
ఈ నిధులను ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా వినియోగించనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఆవరణ పరిశుభ్రత, పాఠశాల బోర్డులను అందంగా రాయించడం, చెత్త సేకరణ డబ్బాల ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులకు విద్యాబోధనకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రస్తుతం 50 శాతం నిధులను విడుదల చేస్తూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు
కిట్లతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసం, భద్రత కోసం ప్రభుత్వం పలు ప్రత్యేక కేటాయింపులు చేసింది.
బాలికల ఆత్మరక్షణ: 20 పాఠశాలల్లో బాలికలకు 3 నెలల పాటు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ కోసం రూ. 6 లక్షలు.
సేఫ్టీ క్లబ్, సాధికారత: 21 పాఠశాలలకు (ఒక్కో దానికి రూ. 20 వేల చొప్పున) రూ. 4,20,000.
తల్లిదండ్రుల సమావేశాలు: విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాల నిర్వహణకు రూ. 4.25 లక్షలు.
దివ్యాంగ విద్యార్థులకు: విహార యాత్ర కోసం రూ. 2 లక్షలు, సంబంధిత మెటీరియల్ కోసం రూ. 7,400.
చైల్డ్ ట్రాక్ సిస్టమ్: విద్యార్థుల పర్యవేక్షణకు రూ. 79 వేలు.
స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ: జిల్లా స్పెషల్ ఎడ్యుకేషన్ శిక్షణ కింద ఒక్కో పాఠశాలకు రూ. 5 వేల చొప్పున కేటాయించారు.
25 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 10.50 లక్షల నిధులు మంజూరు
ఫ సైన్స్, గణిత కిట్ల కొనుగోలుకు 15వ తేదీ వరకు గడువు
ఫ బాలికల ఆత్మరక్షణ, సాధికారత, దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక కేటాయింపులు


