చౌటుప్పల్ : చౌటుప్పల్‌లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన జడ్జిగా శైలజ గురువారం బాధ్యతలు సీకరించారు. కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. కోర్టు పరిపాలన, న్యాయ సేవల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. కక్షిదారులకు వేగవంతమైన, పారదర్శకమైన, నిష్పక్షపాతమైన సేవలను అందిస్తామని ఆమో తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరి పరమేష్, మాజీ అధ్యక్షుడు ఎలమోని శ్రీనివాస్, ఊడుగు శ్రీనివాస్, బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, పడమటి మహిపాల్‌రెడ్డి, మక్తాల నర్సింహ, పిట్టల భిక్షమయ్య, రాపోలు వేణు, రాధాకిషన్‌రావు, జెల్ల రమేష్, రిక్కల సుధాకర్‌రెడ్డి, జక్కర్తి శేఖర్, ఖయ్యూంపాష, పిట్టల భరత్ పాల్గొన్నారు.
రెండో వారంలో ‘వైటీడీ’ సమావేశం!
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి రెండో సమావేశాన్ని రెండో వారం(ఈ నెల 13 లేదా 14వ తేదీన) నిర్వహించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈఓ భవానీ శంకర్ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. శ్రావణ మాసం ప్రారంభమయ్యే మొదటి రోజు 13వ తేదీన, మరుసటి రోజు 14వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి తుర్కపల్లి మండలం వాసాలమర్రికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వీలు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వైటీడీ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. కొండపై డార్మిటరీ హాల్, కల్యాణ మండపం, రాయగిరి సమీపంలో ఆర్చి నిర్మాణం, కొండపైకి ఎలక్ట్రికల్ బస్సుల ఏర్పాటు వంటి అంశాలతో పాటు మరో 10కి పైగా అంశాలను ఎజెండాలో చేర్చి సీఎం సమక్షంలో పాలక మండలి సభ్యులు చర్చించి, ఆమోదం తెలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. శ్రావణ మాసంలో పలు అభివృద్ధి పనులకు పాలక మండలి శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే గురువారం ఈఓ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
పట్టుపురుగుల పెంపకంతో స్థిరమైన ఆదాయం
భువనగిరిటౌన్ : రైతులు పట్టుపురుగుల పెంపకంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివిధ శాఖల జిల్లా అధికారులు పిలుపునిచ్చారు. భువనగిరిలో సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో గురువారం మేరా రేషమ్ మేరా అభిమాన్ 2.0 వాటాదారుల సమావేశం నిర్వహించారు. ఇందులో డీఏఓ వెంకట రమణారెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారిణి హేమలత, జిల్లా పశువైద్యాధికారి జానయ్య పాల్గొని మాట్లాడారు.సదస్సులో సైంటిస్ట్‌లు డాక్టర్‌రవి వర్మ , తిరుపమ్ రెడ్డి, శ్రీనాథ్, రాఘవేందర్, యాదాద్రి ఏడీఎస్ నవీన్‌పాల్ రెడ్డితో పాటు సెరీకల్చర్ రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు.


