భువనగిరి: గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేలా ఆదాయ వనరులు ఏర్పర్చుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. గురువారం భువనగిరి మండలం అనంతారంలో గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే మూడేళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని ఇందులో భాగంగానే అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. అనంతారంలో 63 సంఘబంధాలుండగా వీటిలో 616 మంది సభ్యులు ఉన్నారని వీరికి సీ్త్ర నిధి రుణాలు అందజేస్తాన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతలు, పాఠశాలలో విద్యార్థుల యూనిఫాం పరిశీలించారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి ఫామ్ పాండ్ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. పంచాయతీ రూపొందించిన సమగ్ర ప్రణాళికను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, అదనపు డీఆర్‌డీఓలు సురేష్, జంగారెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్, డీపీఓ శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, మండల ప్రత్యేక అధికారి శ్యామ్ సుందర్, సర్పంచ్ నాగరాణి, ఎంపీఓ దినకర్, ఎంఈఓ రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్


