భూదాన్‌పోచంపల్లి: న్యూఢిల్లీలోని భీమ్‌హాల్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన జీఐ, అండ్ బీయాండ్ 2.0 సమ్మేళనంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శించారు. ఈ సమ్మేళనానికి కేంద్ర చేనేత, జౌళిశాఖ మంత్రి పబిత్ర మార్గేరీటా, జౌళిశాఖ కార్యదర్శి నీలం షమీరావు, డెవలప్‌మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్ మీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు భారత లవకుమార్ పోచంపల్లి చేనేత సహకార సంఘానికి కేంద్రం నుంచి రావాల్సిన 50 శాతం కార్పస్ ఫండ్ సుమారు రూ.37 లక్షల బకాయిలు విడుదల చేసి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని చేనేత డెవలప్‌మెంట్ కమిషనర్ మీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డైరెక్టర్ అరుణ్‌కుమార్ ఉన్నారు.


