యాదాద్రిలో సినీనటుడు శ్రీకాంత్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో సినీనటుడు శ్రీకాంత్‌ పూజలు

Aug 7 2026 4:05 AM | Updated on Aug 7 2026 4:05 AM

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని సినీ నటుడు శ్రీకాంత్‌ గురువారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఈఓ భవాని శంకర్‌ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

10 లీటర్ల సారా స్వాధీనం

హుజూర్‌నగర్‌ : సారా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ నాగార్జునరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం హుజూర్‌నగర్‌ ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో ఎకై ్సజ్‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో పాలకీడు మండలం జానపాడు గ్రామ శివారులో మహంకాళిగూడేనికి చెందిన బనావత్‌ లక్ష్మయ్య ద్విచక్రవాహనంపై సారా తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమలో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ దివ్య, సిబ్బంది నాగరాజు రమణ, డ్రైవర్‌ నరేష్‌ పాల్గొన్నారు.

పశువులు తరలిస్తున్న వాహనం పట్టివేత

చౌటుప్పల్‌ : అక్రమంగా పశువులు తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. కర్నాటక రాష్ట్రం, బల్లారి జిల్లా, సిరుగుప్ప తాలూకాకు చెందిన రోడూరు బాబురావు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తుని సంతలో 29 పశువులను (8ఆవులు, 21ఎద్దులు) కొనుగోలు చేశాడు. వాటిని మరో ఇద్దరు కూలీలు మారుతి, సీరం శ్రీనుతో కలిసి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామ స్టేజీ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులు పశువుల వాహనాన్ని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, పశువులను గోశాలకు తరలించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

మునగాల: మండలంలోని ముకుందాపురం బస్‌స్టేజీ శివారులో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ... మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు ఎలమంద ద్విచక్ర వాహనంపై తన కుమారుడు లింగయ్యతో కలిసి సూర్యాపేటకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యంలో ముకుందాపురం బస్‌స్టేజి శివారులో గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరారపు లింగయ్యకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా ఎలమందకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. ఎలమంద పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఇంజనీరింగ్‌ కళాశాల

బస్సుల తనిఖీ

భువనగిరి: మండల పరిధిలోని అరోరా ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సులను గురువారం జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. సుమారు 1000 మంది విద్యార్థులను నిత్యం హైదారాబాద్‌ నుంచి 20 బస్సుల్లో కళాశాలకు చేరవేస్తుంటారు. దీంతో ఆయా బస్సులు రంగారెడ్డి జిల్లాలో టాక్స్‌ చెల్లిస్తున్నప్పటికీ యాదాద్రి భువనగిరిలో చెల్లించకపోవడంతో అధికారులు బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంతర్‌ జిల్లా పర్మిషన్‌ పత్రాలు సరిగా లేకపోవడంతో 20 బస్సులపై కేసు నమోదు చేసినట్లు డీటీవో నరేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement