మునుగోడు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఆ పార్టీ నాయకులకు సూచించారు. మంగళవారం మునుగోడులోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ దేశంలోని పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తూ కార్మికులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసిన అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 6న జీపు జాతా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ జీపు జాతాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుర్జ రామచంద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొల్గూరి నర్సింహ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తిరిపారి వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, మాదగోని సత్తమ్మ, ఈదులకంటి కై లాస్ గౌడ్, ఉప్పునూతల రమేష్ యాదవ్, బండమీది యాదయ్య, గోసుకొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


