జల నారాయణుడికి మంగళ హారతులు | - | Sakshi
Sakshi News home page

జల నారాయణుడికి మంగళ హారతులు

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

భువనగిరి : పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి జల నారాయణస్వామికి మంగళ హారతుల సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కనుల పండుగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం తిరువీది ఉత్సవ సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి

భువనగిరి : విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగుల (టీవీఏఈ) జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ సంకు సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని డీవీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టిజన్‌ విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వంపై మరోసారి తిరుగబడదామని పిలుపునిచ్చారు. సమావేశంలో టీవీఏఈ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్‌ సుదగాని శ్రీధర్‌గౌడ్‌, కన్వీనర్లు సాయి, చంద్రారెడ్డి, నాయకులు చందర్‌సింగ్‌, సంతోష్‌నాయక్‌, పాండరిరెడ్డి, మహేష్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడాలి

భువనగిరి : తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగేలా పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని జేజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్‌ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ సర్‌పై అసత్య ప్రచారం చేస్తూ ఓటర్లను తప్పుదోవ పటిస్టుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రభారి శ్రీవర్ధన్‌రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అద్యక్షడు పాశం భాష్కర్‌, నాయకులు మురళీధర్‌రెడ్డి, కర్నాటి ధనుంజయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్‌, చంద్ర శేఖర్‌రెడ్డి, యాదిరెడ్డి, అచ్చయ్య, మేడి కోటేష్‌, కృష్ణ, పడమటి జగన్మోహన్‌రెడ్డి, నరేష్‌నాయక్‌, మాధురి, రామకృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించాలి

భువనగిరి : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించేలా తీర్చిదిద్దాలని తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ప్రత్యేక అధికారి ఏ.అనిత అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు, యువతలో నాయకత్వ లక్షణాలతోపాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజనక్రీడల అభివృద్ధి అధికారి జినుకల శ్యాంసుందర్‌, కోచ్‌లు సతీష్‌రెడ్డి, రాంబాబు, ఎం.చైతన్య, డాక్టర్‌ గణేష్‌, యువజన సంఘాల నాయకులు సరగడ కరుణ్‌, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) జిల్లా కార్యదర్శి దశరథరెడ్డి, పీడీలు పీఈటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement