చెలిమితో చిరునవ్వులు! | - | Sakshi
Sakshi News home page

చెలిమితో చిరునవ్వులు!

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

బొమ్మలరామారం : కొత్తగా హాస్టల్‌లో చేరిన విద్యార్థినుల్లో ఇంటిపై బెంగను పోగొట్టి, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) సరికొత్త మార్గంలో పయనిస్తున్నాయి. ‘చెలిమి’ పేరుతో ఆటపాటలు, కథలు, రోల్‌ప్లే, యోగా లాంటి సృజనాత్మక కార్యక్రమాలతో చేపట్టిన ప్రత్యేక శిక్షణ సత్ఫలితాలిస్తోంది. కేజీబీవీ హాస్టళ్లలోని చిన్నారుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి, వారిలోని అద్భుతమైన నైపుణ్యాలను వెలికితీస్తోంది.

సాయంత్రం 3.30 నుంచి

4.30 గంటల వరకు..

జిల్లాలో మొత్తం 11 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో సుమారు 500 మంది వరకు బాలికలు చేరారు. హాస్టల్‌ అంటేనే చిన్నారుల్లో నెలకొనే బెరుకును తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని నింపి.. ఇంటిని మరిపించేలా చేయడానికి జూన్‌ 20న శ్రీచెలిమిశ్రీకి శ్రీకారం చుట్టారు. ఆగస్టు రెండో వారం వరకు 45 రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఉపాధ్యాయులు రోజూ సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు.

సామాజిక శ్రేయస్సు కోసమే..

బాలికల మానసిక, సామాజిక శ్రేయస్సు కోసమే శ్రీచెలిమిశ్రీని ప్రత్యేకంగా రూపొందించారు. వసతి గృహాల్లో ఇతర బాలికలతో ఎలా ఉండాలి? ఎలా నడుచుకోవాలి? ఒత్తిడిని ఎలా అధిగమించాలి? తదితర విషయాలను నేర్పిస్తున్నారు. ఈ క్రమంలో స్నేహపూర్వక వాతావరణం కోసం ఆటలు ఆడిస్తున్నారు. యోగా, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, చిత్రలేఖనం, గ్రూప్‌ డిస్కషన్‌, పాత్ర పోషణ (రోల్‌ ప్లే), పాటలు పాడడం, ఆసక్తికరమైన కథలు చెప్పడం నేర్పిస్తున్నారు. కాగితాలతో పలు ఆకృతులు తయారు చేయిస్తున్నారు.

ఫ కేజీబీవీల్లో వినూత్న కార్యక్రమం

ఫ 6వ తరగతి విద్యార్థినుల కోసం అమలు

ఫ జూన్‌ 20వ తేదీన ప్రారంభం

ఫ ఆగస్టు రెండో వారం వరకు శిక్షణ

ఫ సృజనాత్మక నైపుణ్యాలకు పదును

ఫ ఆటపాటలతో ఇంటిపై బెంగ, మానసిక ఒత్తిడి దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement