ప్రమాణ స్వీకారం జరిగింది ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాణ స్వీకారం జరిగింది ఇలా..

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

ముందుగా చైర్మన్‌ డాక్టర్‌ ఎం.సత్యనారాయణరెడ్డి ఉదయం 11.37గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత సభ్యులు వరుసగా వినోద్‌ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిప్పలగారి విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్‌రావు, డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఓ భవాని శంకర్‌, ప్రధానార్చకుడు కె.వెంకటాచార్యులు ప్రమాణం చేశారు.

ఇద్దరు ఇంగ్లిష్‌లో.. మిగతా వారు తెలుగులో..

పాలక మండలి సభ్యుల్లో వినోద్‌ వెంకటస్వామి, స్వాతి కంఠమణి ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్‌ సత్యనారాయరెడ్డితో పాటు ఆరుగురు సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు తెలుగులో ‘దైవ సాక్షిగా’ అని ఒక్కొక్కరు 5 నిమిషాల పాటు ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రి సురేఖతో వైటీడీ పాలక మండలి సభ్యులు, ప్రభుత్వ విప్‌ ఐలయ్య, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, (ఇన్‌సెట్‌లో) మంత్రి కొండా సురేఖకు శ్రీస్వామి వారి చిత్రపటం అందిస్తున్న ఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement