భవిష్యత్‌కు బలమైన పునాది | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌కు బలమైన పునాది

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

భవిష్యత్‌కు బలమైన పునాది ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది మానసిక ఒత్తిడిని అధిగమిస్తున్నారు

చెలిమి కార్యక్రమం బాలికల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తోంది. విద్యాభ్యాసంతో పాటు సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటూ తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటున్నారు. ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణతో విద్యాలయంలో మెరుగైన ఫలితాలకు బాటలు పడుతున్నాయి. – కందుకూరి సాయిలక్ష్మి,

ప్రత్యేకాధికారిణి, మల్యాల కస్తూర్బా విద్యాలయం

హాస్టల్‌కు వచ్చిన కొత్తలో మానసిక ఒత్తిడికి గురయ్యాను. చెలిమితో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఆటలు, పాటలతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తున్నారు. నాలో భయం పోయి చదువుపై దృష్టి సారించగలుగుతున్నాను. ఇంటిపై ధ్యాస కూడా పోయింది.

– జి.వంశిక, 6వ తరగతి విద్యార్థిని, మల్యాల కస్తూర్బా విద్యాలయం

చెలిమి కార్యక్రమంతో విద్యార్థినులు మానసిక ఒత్తిడిని అధిగమిస్తున్నారు. చదువుతో పాటు కథలు చెప్పడం, యోగా, డ్రాయింగ్‌, రోల్‌ ప్లే, సింగింగ్‌లో శిక్షణ ఇస్తుండడంతో ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకుంటున్నాం. స్నేహపూర్వకంగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

– చంద్రకళ, ఆంగ్ల ఉపాధ్యాయురాలు, మల్యాల కస్తూర్బా విద్యాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement