వలస ఓటర్లకు పరీక్షే.. సర్‌ | - | Sakshi
Sakshi News home page

వలస ఓటర్లకు పరీక్షే.. సర్‌

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

పాత ఓటు జాబితా ఎక్కడ తేవాలి

సంస్థాన్‌ నారాయణపురం : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–ఎస్‌ఐఆర్‌) ప్రక్రియతో క్షేత్రస్థాయిలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి రావడంతో వేలాది మంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అవసరమైన వివరాలు సమర్పించలేకపోతే ఓటు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందేమోనని భయపడుతున్నారు. తెలంగాణలో వివాహం చేసుకుని స్థిరపడిన వారిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలే ఉన్నారు. అదేవిధంగా జీవనపాధి కొసం వచ్చి సిర్థపడిన కుంటుంబాలున్నాయి. సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోనే సుమారు 100కు పైగా కుటుంబాలు మూడు దశాబ్దాల కిందటే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చి స్థిరపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నో కుంటుంబాలు, కోడళ్లుగా వచ్చిన మహిళలు కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2002 నాటి తమ తల్లిదండ్రుల ఓటరు జాబితా వివరాలు లేదా కుటుంబ వంశవృక్షానికి సంబంధించిన వివరాలు సమర్పించాలని అధికారులు సూచించడంతో వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పాత రికార్డులు వెంటనే అందుబాటులో లేకపోవడం, అవసరమైన వివరాలు సకాలంలో లభించకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. దీంతో కొందరు ఓటు నమోదు ప్రక్రియనే విరమించుకునే పరిస్థితి కనిపిస్తోంది.

24 ఏళ్ల నాటి వివరాల కోసం గాలింపు...

ఎన్యూమరేషన్‌ ఫాంలో 2002 నాటి నియోజకవర్గం, గ్రామం, పోలింగ్‌ స్టేషన్‌, ఓటరు క్రమసంఖ్య, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌, సీరియల్‌ నంబర్‌ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉండడంతో ప్రజలు తికమకపడుతున్నారు. చాలా మందికి ఆ వివరాలు గుర్తులేకపోవడంతో బీఎల్‌ఓలు తమ మొబైల్‌లోని పాత ఓటరు జాబితా పీడీఎఫ్‌లను పరిశీలిస్తూ ఇంటింటికీ వెళ్లి వివరాలు వెతికి నమోదు చేయాల్సి వస్తోంది. దీంతో ఓటర్లతో పాటు బీఎల్‌ఓలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫ పనులు మానుకొని

పాత ఓటరు జాబితా కోసం అన్వేషణ

ఫ 24 ఏళ్ల నాటి వివరాలు లేక సతమతం

ఫ పాత రికార్డులు తిరగేసినా లభించని సమాచారం

ఫ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లకు కష్టాలు

నేను ఏపీలోని మచిలీపట్నంలో పుట్టి పెరిగాను. అక్కడి నుంచి గుంటూరు పెద్దకూరుపాడు ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు నివసించాను. అనంతరం 2015లో జీవనోపాధి కోసం సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి వచ్చాను. 2021లో పుట్టపాక గ్రామంలో ఓటరుగా నమోదు చేసుకున్నాను. అప్పటి నుంచి పుట్టపాకలోనే ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను. ఇటీవల బీఎల్‌ఓ సర్‌ ఎన్యూమరేషన్‌ ఫాం ఇచ్చారు. ఆ ఫాం నింపి ఇవ్వాలంటే 2002కు ముందు ఓటరు జాబితా వివరాలు కావాలని చెబుతున్నారు. జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాల్లో నివసించడంతో పాత ఓటరు జాబితా వివరాలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు. అంతా తికమకగా ఉంది. – శ్రీనివాసరావు,

వలస ఓటరు, పుట్టపాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement