‘నవోదయ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

‘నవోదయ’లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపులో నిర్వహించబడుతున్న జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ కె. శంకర్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవవచ్చునని ఆయన తెలిపారు.

అర్హతలు ఇవీ..

2026–27 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 3, 4, 5 తరగతులు ఆయా జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివి ఉండాలని, 01–05–2015 నుంచి 31–07–2017 మద్య జన్మించి ఉండాలన్నారు. 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకే కేటాయించామని, ప్రతి విద్యార్థి ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌ కల్పించబడుతుందని, ఆరో తరగతిలో మొత్తం 80 సీట్లు ఉండగా 1/3 సీట్లు బాలికలకు కేటాయించినట్లు వివరించారు. ప్రవేశ పరీక్షకు నవోదయ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేయడానికి ఆధార్‌ కార్డు, ఆధార్‌ కార్డు లింక్డ్‌ మొబైల్‌ నంబర్‌(ఓటీపీ కోసం), ప్రభుత్వంచే ధ్రువీకరించబడిన బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరని సూచించారు. ఆధార్‌ కార్డు లేని వారు తెలంగాణ ఉంటున్నట్లు నివాస ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తన ఫొటోతో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకుని సంతకంతో ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం నింపి, ఐదో తరగతి చదువుతున్న పాఠశాల హెచ్‌ఎంచే జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు.

ఈ నెలాఖరు వరకు అవకాశం..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 చివరి తేదీ అని, ప్రవేశ పరీక్ష 2026 నవంబర్‌ 28న ఉదయం 11.30 నుంచి 1.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 3, 4, 5 తరగతులు ఒక్కరోజైనా మున్సిపాలిటీలలో చదివినట్‌లైతే వారిని అర్బన్‌గా పరిగణించబడతారని, మరిన్ని వివరాలకు 94489 83776, 94413 76915 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తు ఫారం తప్పుగా నింపితే ఎంపికై నా అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేస్తామన్నారు.

ఫ ఆరో తరగతిలో చేరేందుకు అవకాశం

ఫ ఈ నెల 31 వరకు

దరఖాస్తు చేసుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement