మిర్యాలగూడ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన దామరచర్ల మండలం నర్సాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవింద్(53), సరోజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. గోవింద్ వ్యవసాయ చేస్తుండగా.. సరోజ గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సరోజ అదే గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పది రోజుల క్రితం రాత్రి సమయంలో సరోజ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఆమె భర్త గోవింద్ గమనించి భార్యతో గొడవపడి ఫోన్‌ను నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని సరోజ నిర్ణయించుకుంది. శుక్రవారం రాత్రి తమ చిన్న కుమార్తె ఇంట్లో జరిగిన శుభాకార్యానికి గోవింద్, సరోజ దంపతులు వెళ్లారు. అక్కడ సరోజ మద్యం సేవించింది. అనంతరం భార్యాభర్తలు ఇంటికి వచ్చి నిద్రించారు. శనివారం ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి గోవింద్ ఇంట్లో శవమై కనిపించాడు. బంధువులు సరోజను గట్టిగా నిలదీయడంతో తానే చంపినట్లు అంగీకరించింది. సరోజ ఆమె ప్రియుడు శ్రీను కలిసి గోవింద్‌ను ఊపిరాడకుండా చేసి హత్య చేశారని మృతుడి అన్న దూద్యా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
ఫ భర్తను
హత్య చేసిన భార్య


