బీఆర్‌ఎస్‌ నేతపై పోలీసుల దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతపై పోలీసుల దాడి అమానుషం

Jul 12 2026 6:53 PM | Updated on Jul 12 2026 6:53 PM

రామన్నపేట : చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా రామన్నపేట మండలం బోగారంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పార్టీ సీనియర్‌ నాయకుడు బద్దుల రమేష్‌ను ఎస్‌ఐ సతీష్‌, పోలీస్‌ సిబ్బంది తీవ్రంగా కొట్టడం అమానుషమని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్‌ను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లును కోరారు. అనంతరం చిరుమర్తి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ.. పోస్టింగుల కోసం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. ఈ ఘటనకు బాద్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే కార్యకర్తలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, కూనూరు సాయికుమార్‌, గర్దాసు విక్రం, నాయకులు పోచబోయిన మల్లేశం, బొక్క మధవరెడ్డి, పులిపలుపుల వీరస్వామి, మందడి విద్యాసాగర్‌రెడ్డి, దోమల సతీష్‌, అంతటి రమేష్‌, ఎస్‌కే చాంద్‌, జాడ సంతోష్‌, బత్తుల వెంకటేష్‌, కూనూరు ముత్తయ్య, చొప్పరి నర్సింహ తదితరులు ఉన్నారు.

ఫ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement