ప్రజావాణిలో యూ ట్రెండ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో యూ ట్రెండ్‌

Jul 7 2026 2:13 AM | Updated on Jul 7 2026 2:13 AM

ప్రజావాణికి జిల్లా అధికారులే హాజరుకావాలి : అదనపు కలెక్టర్ల ఆదేశం

ప్రజావాణికి జిల్లా స్థాయి అధికారులు మాత్రమే హాజరుకావాలని, తమకు బదులు సబార్డినేటర్లను పంపించవద్దని అదనపు కలెక్టర్లు భాస్కర్‌ రావు, వెంకారెడ్డి ఆదేశించారు. ప్రజావాణిలో అధికారులకు కేటాయించిన సీట్లలో కూర్చున్న అధికారుల వద్దకు అదనపు కలెక్టర్లు వెళ్లి స్వయంగా ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. ఒకవేళ ఏ అధికారి అయినా రాకపోతే ఆ సీటు ఖాళీగా ఉంటుందే తప్పా వేరే వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

71అర్జీలు

ప్రజావాణిలో 71 అర్జీలు వచ్చాయి. అర్జీల్లో రెవెన్యూ 45, సంక్షేమ శాఖ 5, జిల్లా పరిషత్‌ 4, గ్రామీణ అభివృద్ధి 3, సర్వే ల్యాండ్స్‌ 3, హౌసింగ్‌ 2, అటవీశాఖ 2, పంచాయతీ 2, వ్యవసాయ, విద్య, ట్రాన్స్‌కో, కోపరేటివ్‌, ఎస్సీ డెవలప్‌మెంట్‌ శాఖలకు ఒక్కటి చొప్పున వచ్చాయి.

భువనగిరిటౌన్‌ : ప్రజావాణిలో జవాబుదారీతనం పెంచేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రజలు ఇచ్చే అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించేలా సోమవారం కలెక్టరేట్‌లో సరికొత్త సీటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. పారదర్శకత, అధికారుల్లో బాధ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ పరిపాలనాపరమైన మార్పులు చేశారు.

అధికారులందరికీ నేమ్‌ ప్లేట్లు..

వివిధ శాఖల అధికారులందరికీ వారి పేర్లు, శాఖల వివరాలతో కూడిన నేమ్‌ ప్లేట్లను టేబుల్స్‌పై ఏర్పాటు చేశారు. అధికారులందరూ ‘యూ’ ఆకారంలో కూర్చునేలా చర్యలు తీసుకున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలకు కలెక్టర్‌తో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు కనిపించేలా ఏర్పాట్లు చేశారు.

మొదట కలెక్టర్‌కు ఇచ్చి..

అర్జీదారులు మొదట కలెక్టర్‌కు తమ వినతిపత్రం ఇచ్చిన అనంతరం, అక్కడే రిఫరల్‌ స్లిప్‌ తీసుకొని నేరుగా సంబంధిత జిల్లా అధికారి వద్దకు వెళ్తున్నారు. తమ బాధలు, సమస్యలను అధికారులకు ముఖాముఖి వివరిస్తున్నారు.

కలెక్టర్‌ స్వయంగా పరిశీలన

ప్రజావాణికి ఎంతమంది అధికారులు హాజరవుతున్నారు, ప్రజల సమస్యలపై ఎలా స్పందిస్తున్నారనే అంశాలను కలెక్టర్‌ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావా ణి కార్యక్రమాలను సైతం జిల్లా స్థాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పర్యవేక్షిస్తుండటం గమనార్హం.

గైర్హాజరైన అధికారుల సీట్లు ఖాళీ..

జిల్లాలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లు, కొంత మంది అధికారులు సోమవారం నిర్వహించిన ప్రజావాణికి హాజరు కాలేదు. దీంతో అధికారుల కోసం కేటాయించిన సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజావాణికి ఎవరు వస్తున్నారు, ఎవరు ఎగ్గొడుతున్నారనే విషయం ఈ సీటింగ్‌ విధానం ద్వారా తెలిసిపోతోంది.

ఫ కలెక్టర్‌ చొరవతో అధికారులకు ‘యూ’ ఆకారంలో సీటింగ్‌.. నేమ్‌ ప్లేట్ల ఏర్పాటు

ఫ కలెక్టర్‌కు అర్జీ ఇచ్చాక నేరుగా జిల్లా అధికారితో ముఖాముఖి

ఫ పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా నూతన విధాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement