తుర్కపల్లి: తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం వాసాలమర్రి గ్రామంలోని పలు అభివృద్ధి పనులను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, వివిద శాఖల జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి పనుల పురోగతి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఈ నెలలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ చైర్‌పర్సన్ ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి, సర్పంచ్ దొమ్మాట అనురాధబాబు, పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చాడ భాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ గీతారెడ్డి, తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


