సాక్షి యాదాద్రి: జిల్లాలోని మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నాన్–అఫీషియల్ పర్సన్ ఇన్ చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీ ఆరు నెలలపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, ఏది ముందైతే అది వర్తించే విధంగా నియమించింది. భువనగిరికి పక్కిరు కొండల్ రెడ్డి, చందుపట్లకు జిలుగు సతీష్ పవన్, బీబీనగర్‌కు పొట్టేళ్ల శ్యామ్ కుమార్ లను పీసీఏసీ చైర్‌పర్సన్లుగా నియమించారు. వీరితో ఒక్కో సంఘంలో 12 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి ఆయా సహకార సంఘాల నిర్వహణను పర్యవేక్షించనున్నాయి.
చైర్‌పర్సన్లుగా కొండల్‌రెడ్డి, శ్యాంకుమార్, సతీష్ పవన్


