ప్రభుత్వం నూలు సబ్సిడీకి బదులు నేతన్న భరోసా కింద ఏడాదికి చేనేత కార్మికుడికి రూ.18వేలు, అనుబంధ కార్మికుడి రూ.6వేల చొప్పున మొత్తం రూ.24వేలు ఇస్తామని చెప్పింది. కానీ పథకం ప్రారంభమై ఏడాది గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. దాంతో చేనేత కార్మికులు నగదు డబ్బులు చెల్లించి నూలు కొంటున్నారు. పెరిగిన ధరలతో వస్త్ర వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. నూలు ధరల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
–కర్నాటి పురుషోత్తం,
తెలంగాణ చేనేత జనసమాఖ్య జిల్లా అధ్యక్షుడు


