భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహంచిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి కలెక్టర్ ప్రజలనుంచి 46 అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
శ్మశాన వాటికను ఆక్రమించారు
భువనగిరి మండలం గంగసానిపల్లి గ్రామాంలోని శ్మశాన వాటిక స్థలాన్ని కొంత మంది ఆక్రమించుకున్నారని ఆ గ్రామస్తులు ప్రజావాణిలో అర్జీ సమర్పించారు. అర్జీ ఇచ్చినవారిలో సత్యనారాయణ, వెంకటేష పాండు, నవీన్, స్వామి, సత్తయ్య, లక్ష్మయ్య ఉన్నారు.
నష్టపరిహారం చెల్లించాలి
బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న తమకు పరిహారం ఇవ్వాలని చోకళ్లతండా, కోట్య తండా, పీర్యతండాల వాసులు కోరారు. భూసేకరణ చేసి సంవత్సరాలు గడుస్తున్నా నష్టపరిహారం రాలేదన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


