భూదాన్‌పోచంపల్లి : గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సర్పంచ్‌ల పై ఉందని భువనగిరి డీఎల్‌పీఓ బి. శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మోటకొండూర్, ఆత్మకూర్ (ఎం), గుండాల మండలాలకు చెందిన నూతన సర్పంచ్‌లకు చివరి విడత శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు పంచాయతీరాజ్ చట్టం, సర్పంచ్‌ల విధులు, నిధుల వినియోగం, గ్రామంలో కల్పించాల్సిన మౌలిక వసతులపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనింగ్ కోఆర్డినేటర్ రాములు, టీఓటీలు నవీన్‌కుమార్, ఎం.డీ. మాజిద్, దినకర్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


